Life Quotes in Telugu | 1500+ Life Quotations in Telugu
If you want to do something in life, then these Heart Touching Life Quotes in Telugu will take you to your destination & will make you strong from inside. No matter what the difficult situation, these Life Quotations in Telugu will give you courage.
Life Quotes in Telugu
నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా,
పోగొట్టుకున్న దాని గురించి
ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.
జీవితం అంటే నిన్ను
నువ్వు చూసుకోవటం కాదు,
నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.

అర్థరహితమైన మాటలకన్నా,
అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.
ఎక్కువగా నమ్మటం,
s ఎక్కువగా ప్రేమించటం,
ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే
బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.

నీవు ప్రతీరోజు ఒకటికన్నా
మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు,
అది ఎవరోకాదు నిన్నటి నువ్వే.
జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు.
ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని
ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.

నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే,
ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.
జీవితం చాలా కష్టమైన పరీక్ష.
దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం,
ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.

ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం
ఆపినపుడు నీవు నీ అసలైన
జీవితపు ఆనందాన్ని పొందుతావు.
కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది,
హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది,
మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.

నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు
దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.
నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే
నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి.

మనం ఎప్పటికీ గుర్తిండిపోవాలంటే
చదవదగిన పుస్తకాలు రాయాలి.
లేదా రాయదగిన పనులు చేయాలి.
మనం జరిగిపోయిన దాన్ని
వెనక్కి వెళ్లి మార్చలేకపోవొచ్చు
కానీ జరగబోయేదాన్ని
కచ్చితంగా మార్చవచ్చు.

ఏడ్చనివాడు బలశాలి కాదు,
ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను
ఎదుర్కొనేవాడు బలమైన వాడు.
ఒక ధనవంతుడుకి పేదవాడికి
మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని
ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రమే.

పనివంతులు “పని” ని కూడా “విశ్రాంతి” గా భావిస్తారు.
బద్దకస్తులు “విశ్రాంతి” ని కూడా “పని” లా భావిస్తారు.
నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని
చూసి చీకటి భయపడుతుంది.
అలాగే నిరంతరం కష్టపడేవాడిని
చూసి ఓటమి భయపడుతుంది.

సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు.
ఒక్క అడుగు ప్రారంభిస్తే వేయి
మైళ్ళ ప్రయాణమైనా పూర్తి అవుతుంది.

Heart Touching Life Quotes in Telugu
ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి
ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు.
అలాగే నడత చెడిందంటే ఎలాంటి
పనులు చేయడానికైనా మనిషి సందేహించడు.
ప్రతి అడుగును లక్ష్యంగా
మార్చటం వల్ల ప్రతీ లక్షాన్ని
అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు.
జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో,
వారి వల్లే ఎక్కువ బాధపడతావు.
అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు
ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి.
లేదా ఆ కాంతిని ప్రతిబింబించ
గలిగే అద్దంగా అయినా మారాలి.
నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో
నువ్వు నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం.
అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో.
ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని
లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.
పని చెయ్యాలనుకునే వారికి దారి దొరుకుతుంది.
చెయ్యకూడదు అనుకునేవారికి సాకు దొరుకుతుంది.
మన అజ్ఞానం గురించి
తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము.
అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది.
విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి.
నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషి ఒక పుస్తకమే.
ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది.
అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంద.
చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది.
కానీ జీవితం ముందు పరీక్ష
పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది.
పదిమంది మనం చేసే ప్రతీ
పనిని ప్రశంసించాలని ఆరాటపడటం
వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది.
అందరిలో మంచి చూడడం
నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో
నీ అంత బలమైనవాడు వేరొకరు లేరు.
మన ఆత్మీయులతో పంచుకుంటే
సంతోహం రెట్టింపవుతుంది.
అలాగే విషాదం సగం అవుతుంది.
పరిస్థితులు భయస్తులను ఆడిస్తాయి,
ధైర్యవంతులు చెప్పినట్లు ఆడతాయి.
అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా
ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం.
నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరుచుకోకపోతే ఎవరో
ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు.
ఆత్మ విశ్వాసం లేకపోవటం
అపజయాలకు గల ముఖ్య కారణం.
చెయ్యగలిగిన వాడు చేస్తాడు.
చెయ్యలేని వాడు చెప్తాడు.
ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు.
దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి.
కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు.
దాని గురించి పని చేయడం తెలియాలి.
కాలం విలువ తెలియని వాడు
జీవితం విలువ అర్థం చేసుకోలేడు.
జీవితంలో సెక్యూరిటీ అనేది ఓ అపోహ మాత్రమే.
జీవితం అంటేనే ఓ సాహసం.
సాహసం చేయకపోతే జీవితంలో ఏదీ మిగలదు.
Life Quotations in Telugu
ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి
కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు.
ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి
కానీ మీ వల్ల ఏడవకూడదు.
తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి..
ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు.
తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు.
మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది,
అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది.
జీవితం లో ఎన్ని మైలు రాళ్ళు ఉన్నా..
నిజంగా ఉండవలసినవి పెదవి ఫై చిరునవ్వు తెచ్చే
ఆ కొన్ని క్షణాలు మాత్రమే.
జీవితంలో కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలని భావించేవారు..
అలాగే కొత్త కలను కనేందుకు సిద్ధమయ్యేవారు
ఎప్పుడూ వయసు పైబడిన వారు కారు.
జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే.
మరో తలుపు తెరుచుకుంటుంది.
కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ..
మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం
గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు.
ఎవరో విమర్శించారనో,
హేళన చేశారనో ఉన్నతుల మనస్సు కలత చెందదు.
అద్దమే నా మంచి మిత్రుడు..
ఎందుకంటె నేను ఏడ్చినప్పుడు
అది తిరిగి నవ్వదు కనుక -చార్లీ చాప్లిన్.
ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత..
నువ్వు చేసిన పనుల గురించి కాకుండా..
చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు.
అందుకే నచ్చినవన్నీ చేసేయాలి.
ఎంతో ఆకలితో ఉన్నా సింహం గడ్డిని మేయదు.
అలాగే కష్టాల పరంపర చుట్టూ ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.
తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో..
తన ఎదుగుదలకు పునాదులు
వేసుకునే వాడే తెలివైన వ్యక్తి
తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావ్
తుది శ్వాస విడుస్తూ ఎడిపిస్తావ్
రెండు ఏడుపులు మధ్య
నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం
సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే..
నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది.
ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా
కేవలం ఊహలతోనే కాలాన్ని
గడిపితే ప్రయోజనం ఉండదు.
నారుపోసినంత మాత్రాన పంట పండదు కదా.
నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు.
కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే..
ఒక్కసారి జీవించినా చాలు
పది మందికి మేలు చేసే వాడివి నువ్వైతే నీ
వెనుక ఎప్పుడూ వంద మంది వుంటారు
తనతో తాను ప్రతి రోజు ప్రేమలో పడే వ్యక్తికి..
శత్రువులే ఉండరు.
చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని
ఇచ్చినట్లుగానే కష్టాల తరువాత వచ్చే
సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి.
Best Quotes on Life in Telugu
సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్లు కాదు.
ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు
జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి.
ఎందుకంటే.. ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి
చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయ
జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే..
అసలు ప్రారంభించనిదే.
అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది
ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం
వెయ్యి కోరికలు తీర్చుకున్నా లభించదు.
ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే..
ఏ పనులను చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటారో..
అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి.
నేను అదృష్టాన్ని నమ్ముతాను. ఎందుకంటే
నేనెంత కష్ట పడితే అది నన్నంతగా వరిస్తుంది.
అదృష్టం మన నుదుటన
ఉండదు మన కృషితోనే ఉంటుంది.
మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది.
ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే..
అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది.
జీవితంలో అన్ని నిబంధనలను పాటిస్తే..
అది అందించే ఫన్‌ని ఎంజాయ్ చేయలేం.
రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు.
అలాగే కష్టాలకు తట్టుకోలేని
మనిషి విజయాన్ని సాధించలేడు.
మన జీవితంలో రెండు తేదీలు ముఖ్యం.
మన సమాధిపై రాసే జనన, మరణ తేదిలవి.
కానీ ఆ రెండు తేదీల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో..
మనం ఏం చేశామనేది మాత్రమే..
ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు.
నేను క్షమిస్తాను, దాని అర్థం
ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు,
నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని.
జీవితంలో కావాల్సిన దానికంటే
ఎక్కువ పొందడానికి ఒకే ఒక్క దారి..
దాన్నో పెద్ద అడ్వెంచర్‌గా చూసి..
ధైర్యంగా ముందుకెళ్లడమే..
ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు.
ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి.
జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒకటే.
అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే.
జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా
కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే.
జీవితం అనేది ఓ పెద్ద కాన్వాస్ లాంటిది.
దానిపై ఎన్ని కొత్త రంగులతో పెయింటింగ్ వేస్తే..
జీవితం అంతే కలర్ ఫుల్‌గా ఉంటుంది.
అందుకే కొత్త విషయాలను నేర్చుకోవడానికి వెనుకాడద్దు.
తన ఆశయాలకు పనిచేయక
సన్నగిల్లిన వ్యక్తి ముసలివాడితో సమానం.
ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు
జీవించామన్నది ముఖ్యం కాదు..
ఆయా సంవత్సరాలలో ఎంత
ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం.
నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహించినపుడు,
నీ ఆశయాలను పూర్తిచేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది.
Life Failure Quotes in Telugu
గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి..
అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి.
కానీ ఈ రోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం.
జీవితంలో మనం ఎవరిని కలిసినా..
వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం.
అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా.
అయితే ఏది తీసుకోవాలనేది..
మనపై ఆధారపడి ఉంటుంది.
విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు.
తన విశ్వాసాన్ని నిరంతరం
నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు.
జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా
మారినపుడు పడే బాధ చాలా కష్టమైనది,
మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి.
అందమైన జీవితం వెతికితే దొరకదు,
మనం నిర్మిస్తే తయారవుతుంది.
గొప్ప పనులు చేయలేనివారు చిన్న పనులు గొప్పగా
చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు.
ఇతరులు నిన్ను అగౌరవపర్చేందుకు
అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే..
తలుపు తీయొద్దని పెద్దలు చెబుతుంటారు.
అందుకే నీ చుట్టూ కేవలం
పాజిటివ్‌గా మాట్లాడే వారినే ఉంచుకోవాలి.
ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు
పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు.
ఆశని ఎప్పుడూ కోల్పోవద్దు.
మన ఈ రోజటి ఆశయాలే
మనం ఊహించే రేపటి వాస్తవాలు.
జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది.
దానికి కావలసింది కేవలం మన అంగీకారమే.
ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం
దాని గురించి మాట్లాడడం ఆపి.. ఆ పని చేయడమే.
మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు.
దానిని వృద్ధి చేయటానికి అయి ఉండాలి.
నిరాశావాది తనకు ఎదురైన.. ప్రతి అవకాశంలో
ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు.
కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ
అవకాశాలను వెతుక్కుంటాడు.
జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా
గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది.
జీవితంలో మనం గెలుపు కంటే..
ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం.
అందుకే ఓటమి మనల్ని
అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి.
ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే..
దాని గురించి మనకు ఒకరు గుర్తుచేస్తూ..
ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు.
మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది.
జీవిత కోట్స్
తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే..
పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు.
సరిగ్గా ఆలోచిస్తే.. ఈ ప్రపంచంలో
అస్సలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు.
అయితే మనకు కావాల్సిందల్లా
పాజిటివ్‌గా ఆలోచించి ముందడుగు వేయడమే.
జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి.
కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు.
జీవితంలో పాజిటివ్‌గా ఆలోచించేందుకు..
మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం.
మీరు మనసులో ఏం ఫీలవుతున్నారో
అది మీ ముఖంలో కనిపిస్తుంది.
అందుకే ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ
ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి.
మనం అందరి గురించి పాజిటివ్‌గా ఆలోచించి..
పాజిటివ్‌గా మాట్లాడితే..
అదే పాజిటివిటీ మనకు కూడా సంక్రమిస్తుంది.
మనం కష్టాలను ఎదుర్కొంటాం.
ఇబ్బంది ఫీలవుతాం. అదే జీవితం. కానీ జరిగేదంతా..
మనకు ఏదో ఒకటి నేర్పేందుకే జరుగుతుంది.
అందుకే ప్రతి నెగెటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి.
మనం కోరుకునే జీవితం లో
మనం సంపాదించని
జీవితం అదే కాదు.
జీవితం ఒక క్లేశం కాదు,
ఒక దృష్టికన్నా ఉన్నాడు
అని తెలుసుకోండి.
These Heart Touching Life Quotes in Telugu & Life Quotations in Telugu will make you strong from inside & will give you courage. You may also want to see our Life quotes in Hindi. You can also find us on Pinterest, Facebook & Instagram.

Sanjay Jangam is a Chief Content Producer with HeloPlus. He covers Technology, Business, entertainment & Personal finance stories.