Friendship Quotes in Telugu | 1500+ Best Friend Quotes in Telugu

Quotes

Best Friend is the one who is always there for you through thick & thin. He’s the one who is ready to listen and understand whatever the situation may be. Friendship is a relationship of mutual affection between people. Here are the best 1500+ Friendship Quotes in Telugu & Best Friend Quotes in Telugu, Share it with your friends.

Friendship Quotes in Telugu

ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా
తిరిగి ఏకమై పయనాన్ని
సాగించే బంధమే స్నేహ బంధం.

మన ఆట పాటల్లోనే కాదు,
మన జీవితంలోని ఆటు పోట్లలో
తోడుండే వారే నిజమైన స్నేహితులు.

friendship quotes in telugu

స్నేహమంటే మన భుజంపై
చెయ్యేసి మాట్లాడటం కాదు,
మన కష్ట సమయాలలో భుజం
తట్టి నేనున్నాని చెప్పటం.

కులమత బేధం చూడనిది,
పేద, ధనిక బేధం లేనిది,
బంధుత్వం కన్నా
గొప్పది స్నేహం ఒక్కటే.

friendship day quotes in telugu

గాయపడిన మనసుని సరిచేసేందుకు,
స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు.

నీగురించి అన్నీ తెలిసిన
వ్యక్తి, కలవలేక పోయినా
నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే
వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే.

best friend quotes in telugu

విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ,
గడిస్తే తెలుస్తుంది కాలం విలువ,
స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది,
స్నేహితుడి విలువ.

నువ్వు నలుగురిలో ఉన్నా నీలో
నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ,
నీలో నువ్వు లేకున్నా మేం నలుగురం
నీకున్నాం అని చెప్పేది స్నేహం.

heart touching friendship quotes in telugu

నీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్నా
నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.

స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పులేదు,
కానీ మోసం చేయటానికి స్నేహాన్ని
కోరితే అది క్షమించరాని తప్పు.

friendship quotations in telugu

చిన్న విషయం కాదు స్నేహం,
ఎంతటి సమస్యనైనా చిన్నదిగా
మార్చే అద్భుత ఉపకరణం.

నువ్వు జీవితంలో ముందుకి సాగడానికి
కావాల్సిన వాటిల్లో ‘స్నేహం’ ఒకటి.

friendship day quotations in telugu

స్నేహంలో జీవితం ఉండదేమో కాని
స్నేహం లేని జీవితం ఉండదు.

స్నేహానికి కులం, మతం
డబ్బు ఏనాటికి అడ్డంకులు కావు.

true friendship quotes in telugu

కటిపడితే.. మన నీడే మనల్ని వీడుతుంది.. కానీ,
స్నేహం.. ఎప్పుడూ మనతోనే ఉంటుంది.
స్నేహితుల రోజు శుభాకాంక్షలు.

ఈ ప్రపంచంలో పరిమితులు
లేని బంధాలలో స్నేహం కూడా ఒకటి.

besties quotes in telugu

ప్రేమకి ఎప్పుడు ముందుండేది స్నేహమే.

స్నేహం చేయడానికి తొందరపడవద్దు
ఒకసారి చేశాక ఎప్పటికి వదలద్దు.

friendship kavithalu

సూర్యుడు ఉదయించటం మరచినా,
సముద్రం అలలను మరిచినా,
సాయం చేయటం మరువనిది నిజమైన స్నేహం.

ప్రేమ లేని స్నేహం ఉంటుందేమో..
కాని స్నేహం లేని ప్రేమ ఉండదు.

best friend friendship quotes in telugu

Best Friend Quotes in Telugu

నా జీవితంలో తల్లిదండ్రులని,
తోబుట్టువులని నేను ఎంచుకోలేకపోయాను
కాని నిన్ను, నీ స్నేహాన్ని ఎంచుకోగలిగాను.

మదిలోని మంచితనానికి మరణం లేదు.
ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు.
అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు.

నీ ఆనందంలో తోడున్నా లేకపోయినా
నీకు ఎదురయ్యే ఆపద ముందు నేనుంటా!

నీకు కాలక్షేపాన్ని ఇచ్చేవాడే కాదు,
నీ కష్టాలను కుడా పంచుకునే
వాడు నిజమైన స్నేహితుడు.

వేయి మంది మిత్రులున్నా అది తక్కువే,
ఒక్క మిత్రుని పోలిన శత్రువున్నా అది ఎక్కువే.

స్నేహానికి కులం లేదు.. స్నేహానికి మతం లేదు..
స్నేహానికి హోదా లేదు… బంధుత్వం కంటే గొప్పది,
వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒక్కటే!

స్నేహానికి ఒక అందమైన
రూపమంటూ ఒకటుంటే.. అది నీవే

భాష లేనిది, బంధమున్నది..
సృష్టిలో అతి మధురమైనది..
జీవితంలో మనిషి మరువలేనిది..
స్నేహం ఒక్కటే!

నీతో స్నేహం చేయడానికి ఏమాత్రం
కూడా ఆలోచించకపోవడమే..
నేను చేసిన ఒక మంచి పని.

మౌనం వెనుక మాటను,
కోపం వెనుక ప్రేమను,
నవ్వు వెనక బాధను అర్థం
చేసుకునే వాడే స్నేహితుడు.

నేను తప్పుచేసినా సరే ఎప్పుడు భయపడను!
ఎందుకంటే… నా పక్కన నువ్వు ఉంటావన్న ధైర్యం

ప్రేమ స్నేహాన్ని అడిగింది..
నేనున్న చోటు నువ్వెందుకు ఉండవని.
అప్పుడు స్నేహం ప్రేమతో ఇలా అంది..
నీవు కన్నీరు మిగిల్చిన చోట నేను ప్రేమనందిస్తా

నా విజయంలో సింహ భాగం.. మన స్నేహానిదే.

జీవితంలో సంతోషాన్నిచ్చే వాటిలో..
స్నేహం ముందు వరుసలో ఉంటుంది.

ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా,
నిర్భయంగా పంచుకోగలిగేది
ఒక్క స్నేహితుడి దగ్గర మాత్రమే.

ఒక్కోసారి ఓటమి కూడా మేలే చేస్తుంది.
నిజమైన మిత్రులెవరో నీకు తెలిసేలా చేస్తుంది.

నీతో స్నేహం.. నా జీవితంలో
వచ్చిన ఒక మంచి మార్పు.

షరతులు లేకుండా నీతో ఉండేవాడు,
ఏమీ ఆశించకుండా నీ
మంచిని కోరేవాడు, నీ స్నేహితుడు.

నేను ఎప్పుడు టెన్షన్‌లో ఉన్నా
గుర్తుకు తెచుకునేది నీ పేరే.

Friendship Kavithalu

నీ కళ్లలో కన్నీరులా జారి..
మనసులో భావంగా మారి..
నీ ఊపిరిలో శ్వాసగా చేరి..
ప్రాణం ఉన్నంత వరకు నీ
స్నేహితుడిగానే ఉంటాను నేస్తమా!

నా జీవితంలో ఎన్నటికి
మర్చిపోలేనిది నీతో స్నేహం

ఎంత మంది బంధువులున్నా,
అన్ని భావాలను పంచుకోగలిగేది
ఒక్క స్నేహితుడితో మాత్రమే.

డబ్బు లేని వాడు పేదవాడు..
స్నేహితుడు లేనివాడు దురదృష్టవంతుడు.

మరిచే స్నేహం చేయకు.
స్నేహం చేసి మరవకు!

స్నేహానికి పర్యాయ పదమే నువ్వు

తన మిత్రుడు ఆనందంగా
ఉన్నపుడు పిలిస్తే వెళ్ళేవాడు,
దుఃఖంలో ఉన్నపుడు పిలవకపోయినా
వెళ్ళేవాడు నిజమైన స్నేహితుడు.

స్నేహానికి చిరునామా అని నన్ను
ఎవరైనా అడిగితే..
నీ చిరునామా ఇచ్చేస్తాను

మోసం చేసి స్నేహం చేస్తే తప్పులేదు. కానీ,
మోసం చేయడానికే స్నేహం చేయకు!

స్నేహం అనే మార్గంలో
నాకు దారి చూపిన దీపానివి నీవు

నువ్వులేకుంటే నేను లేనని
అనేది ప్రేమ అయితే, నువ్వుండాలి,
నీతో పాటు నేనుండాలి
అని ధైర్యాన్నిచ్చేది స్నేహం.

స్నేహానికి అసలైన నిర్వచనం ఏంటి అంటే
అది నా పైన నీకున్న ప్రేమే.

కనులు నీవి.. కన్నీరు నాది. హృదయం నీది..
సవ్వడి నాది. ఈ స్నేహబంధం మన ఇద్దరిది!

డబ్బు నాకు సుఖాన్నిస్తే..
నీ స్నేహం నాకు
వెలకట్టలేని ఆనందాన్నిచ్చింది.

నీమీద నీకే నమ్మకం లేని సమయంలో
కుడా నిన్ను నమ్మేవాడే నీ స్నేహితుడు.

స్నేహంలో మొదటి అక్షరం నేనైతే..
రెండో అక్షరం నువ్వు

వెలుతురు ఉన్నప్పుడు ఒంటరిగా నడవడం కంటే..
స్నేహితుడితో చీకట్లో నడవటం ఉత్తమం

స్నేహం అనే సముద్రంలో
నాకు దొరికిన ఆణిముత్యానివి నువ్వు

నీ శత్రువును మిత్రుడిగా మార్చేందుకు
వేయి అవకాశాలు ఇవ్వవచ్చు,
కానీ నీ స్నేహితుడిని శత్రువుగా
మార్చేందుకు ఒక్క అవకాశం కుడా ఇవ్వకు.

మన స్నేహానికి ఎటువంటి
అడ్డుగోడలు నిలబడలేవు

మీరు గాయపడితే సానుభూతి
తెలిపేవారు చాలామంది ఉంటారు. కానీ,
ఒక్క ఫ్రెండ్ మాత్రమే..
ఆ గాయాన్ని మరిచిపోయేలా చేస్తాడు!

మన స్నేహం ఇన్నాళ్లు
బ్రతికుందంటే అది కేవలం నీవల్లే…

మంచి స్నేహితుడు అద్దంలాంటి వాడు,
అద్దం ఉన్నది ఉన్నట్టుగా చూపినట్లే,
మంచి స్నేహితుడు మనం చేసిన తప్పు ఒప్పులను,
ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైనే చెపుతాడు.

Friendship Quotations in Telugu

అరేయ్.. మన స్కూల్‌లో ఉన్న
ప్రతి చెట్టు మన స్నేహానికి సాక్ష్యమే

మిత్రమా.. నీ బాధలన్నీ తీరుస్తానని
నేను హామీ ఇవ్వలేను. కానీ,
ఆ బాధల్లోనూ నేను నీకు నిరంతరం
తోడుగా ఉంటానని మాత్రం హామీ ఇవ్వగలను

ఫ్రెండ్ షిప్ డే రోజు మాత్రమే కాకుండా..
ప్రతిరోజు గుర్తుపెట్టుకోదగ్గ స్నేహం మనది.

అవసరానికి పనికిరాని ఆస్తులు,
ఆపదలో ఆదుకోని స్నేహితులు ఉన్నా లేనట్టే.

ఏ స్కూల్ బస్ ని చూసినా..
మనం చిన్నపుడు స్కూల్ బస్‌లో
చేసిన అల్లరే కళ్ళముందు కనిపిస్తుంది.

నీ కథలన్నీ తెలిసినోడు… మంచి స్నేహితుడు.
ప్రతి కథలో నీతోపాటే ఉండేవాడు.. నీ బెస్ట్ ఫ్రెండ్!

స్నేహానికి ఒక గ్రూప్ అంటూ ఉంటే..
అది మన ఫ్రెండ్స్ గ్రూప్ అని గర్వంగా చెప్పగలను.

చిరునవ్వు చాలు మహా యుద్ధాలను ఆపటానికి,
చిరు మాట చాలు స్నేహం చిగురించటానికి,
ఒక్క స్నేహితుడు చాలు జీవితం మారటానికి.

కాలేజీలో మన ఫ్రెండ్స్
గ్రూప్‌కి ఉన్న ఫాలోయింగ్..
నేను ఎప్పటికి మర్చిపోలేను.

జీవితం అనే పుస్తకంలో
స్నేహం అనే కాగితంలో
మరువలేనిదే మీ స్నేహం!

నాకు ఏదైనా సమస్య వచ్చిందని తెలియగానే..
నా ముందుకి పరిష్కారంతో
సహా వచ్చేసేవాడివి నువ్వొక్కడివే.

జీవితంలో లక్షలు
సంపాదించినా లభించని సంతోషం,
మంచి మిత్రుడు దొరికితే లభిస్తుంది.

జీవితంలో నాకు మన స్నేహం ఇచ్చినంతగా కిక్కు..
మరే ఇతర విషయం కూడా ఇవ్వలేకపోయింది.

చెమరించిన నయనాల్లో చెదిరిపోని జ్ఞాపకం స్నేహం
ఒడిదుడుకులలో ఓదార్పునిచ్చి
ఒడ్డున చేర్చే అభయహస్తం స్నేహం
ప్రతిఫలం ఆశించకుండా తోడై నిలిచేది స్నేహం
హృదయాన్ని స్విచ్ఆఫ్ చేయకుండా ఉంచితే
జీవితాంతం పనిచేసే అద్భుత నెట్‌వర్క్ స్నేహం!

నీగురించి అన్నీ తెలిసిన వ్యక్తి,
అయినా నిన్ను ఇష్టపడే
వ్యక్తి, నీ స్నేహితుడు ఒక్కడే.

నా జీవితంలో ఏమాత్రం
కూడా కష్టపడకుండా దొరికింది..
నీ స్నేహం మాత్రమే.

నేను బాధలో ఉన్నప్పుడు..
నీ ఓదార్పు నాకు ఎంతో
మనశ్శాంతినిని ఇచ్చింది

జగతిలో స్నేహానికి అడ్డులేదు..
ఏది అడ్డు కాదు కూడా.

స్నేహం అనే క్రికెట్‌లో
మనల్నిద్దరిని అవుట్ చేసేవారే లేరు.

రోజులు మారినా, మనుషులు మారినా,
శరీరాలు మారినా, మారిపోని వాడు ఒక్క
స్నేహితుడు మాత్రమే.

మనసులో మాటల్ని ఎవరితో నిర్భయముగా,
నిస్సంకోచంగా, నమ్మకంగా
పంచుకోగలమో వారే స్నేహితులు

Friendship Day Quotes in Telugu

స్నేహం చిన్న విషయం కాదు..
ఎంత పెద్ద సమస్యనైనా
చిన్నదిగా మార్చే సాధనం

ద్వేషించడానికి క్షణ కాలం సరిపోతుందేమో!
అదే స్నేహానికి మాత్రం ఒక జీవిత కాలం పడుతుంది.

మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం,
అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం.

మన స్నేహం గొప్పతనాన్ని
వర్ణించడానికి నావద్ద మాటలు లేవు.
కేవలం నీ పైన ఉన్న స్నేహం తప్ప .

ఆపదలో అవసరాన్ని..
బాధలో మనసుని తెలుసుకుని
సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు

జీవితంలో మనం ఓడిపోయినప్పుడు..
మన వెన్నుతట్టే వారిలో ఒక
స్నేహితుడు/స్నేహితురాలు కచ్చితంగా ఉంటారు.

మనకు ఎన్ని బంధాలు,
బంధుత్వాలు ఉన్నా మన బాధలను,
సంతోషాలను, పూర్తిగా అర్థం చేసుకునే
స్నేహితుడితో పంచుకోవటంలో ఉన్న ఆనందమే వేరు.

మన స్నేహంలో మొదటి అంకం నేనైతే..
చివరి అంకం నువ్వు

ఆనందం చెప్పలేనిది, సంతోషం పట్టలేనిది,
కోపం పనికిరానిది, ప్రేమ చెరిగిపోనిది
స్నేహం మరువరానిది

ఎదుటివారు చూసి మరీ
ఈర్ష్యపడేంత గొప్పది మన స్నేహం

నిజమైన స్నేహితుడు నక్షత్రంలాంటి వాడు,
మాయమైనట్టు కనిపించినా ఎప్పుడూ అక్కడే ఉంటాడు.

గెలుపోటములకు అతీతమైన బంధం – స్నేహం.

స్నేహం చేయడానికి మోసం చేసినా తప్పులేదు..
కాని మోసం చేయడానికి స్నేహం చేయకూడదు.

తాను ఓడిపోయినా సరే..
తన నేస్తం గెలవాలని కోరుకునే
స్వచ్ఛమైన బంధమే స్నేహం.

నీ మనస్సులోని మాటలను వినగలిగి,
నీవు చెప్పలేని మాటలను
చెప్పగలిగేవాడే నీ స్నేహితుడు.

ప్రతి బంధానికి ఆఖరి రోజు ఉంటుంది
ఒక్క మన స్నేహానికి తప్ప.

నిజాయితీ & నమ్మకం లేని
స్నేహం ఎక్కువ కాలం నిలబడదు.

దోస్త్ మేరా దోస్త్” అనే పాట..
మన ఇద్దరికోసమే రాసుంటారని
నేను అనుకోని రోజంటూ ఉండదు.

స్నేహం చేయటానికి పది సార్లు ఆలోచిస్తే,
దాన్ని వదులుకోవడానికి వంద సార్లు ఆలోచించు.

కన్నీళ్లు తెప్పించేవాడు కాదు..
కష్టాల్లో తోడుండేవాడు స్నేహితుడు

నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేది ‘ప్రేమ’..
నేను లేకపోయినా నువ్వు ఉండాలని కోరుకునేది ‘స్నేహం’.

స్నేహ కోట్స్

తాను కష్టాల్లో ఉన్నా..
తన వారి కష్టాలని తీర్చేందుకు
ప్రయత్నించేవాడు స్నేహితుడు

జీవితం మనకు ఇచ్చే గొప్ప బహుమతి స్నేహం,
ఆ స్నేహాన్ని నేను అందుకున్నాను.

మన అభిమతానికి అనుగుణంగా
నడిచేవాడు స్నేహితుడు

స్నేహమంటే మాటలతో పుట్టి
చూపులతో మొదలయ్యేది కాదు
స్నేహమంటే మనసులో
పుట్టి మట్టిలో కలిసిపోయేది..

అద్దం మనకు నిజమైన నేస్తం..
ఎన్నటికీ అబద్దం చెప్పదు.

స్నేహం పలకల పొందిన
ఒక మాట కంటే మంచిది.

మిత్రత్వం జీవితంలో
అత్యంత ముఖ్యమైన
విషయం.

We hope you have liked this Friendship Quotes in Telugu & Best Friend Quotes in Telugu. You may also want to see our Friendship Quotes in Hindi Collection.

You can also find us on Pinterest, Facebook & Instagram.

Leave a Reply